GNTR: అమరావతి కనెక్టివిటీకి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ కోసం CRDA 27.73 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. తాడేపల్లి పరిధిలో సీతానగరం-మణిపాల్ ఆస్పత్రి మార్గానికి 23.68 ఎకరాలు, E-13 రోడ్డు లింక్‌కు 4.05 ఎకరాలు సేకరించనుంది. మొత్తం 74 మంది భూ యజమానులు ప్రభావితమవుతారని, అభ్యంతరాలు ఉంటే తెనాలి సబ్ కలెక్టర్‌ను సంప్రదించాలని సూచించింది.