మంచిర్యాల DEO యాదయ్య బదిలీ అయ్యారు. DD, DEO లకు బదిలీల్లో భాగంగా యాదయ్యను హైదరాబాద్ DEOగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడేళ్ల క్రితం ఆయన 2023 మే 5న మంచిర్యాలకు బదిలీపై వచ్చారు. SSC పరీక్షల్లో ప్రతి ఏడాది ఉత్తీర్ణత శాతం మెరుగుపడేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. ప్రస్తుతం మంచిర్యాల DEOగా ఎవరిని నియమించలేదు.