AP: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైందని రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సీఎం రమేష్ అన్నారు. అభివృద్ధికి కొత్త ఇంజిన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ కేవలం పరిపాలనా విభాగం కాదని, ఉత్తరాంధ్ర భవిష్యత్‌ను మార్చే అభివృద్ధి వేదిక అని స్పష్టం చేశారు. కాగా, విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఇవాళ్టి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి.