BDK: మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం సేవ కమిటీ సభ్యులు ఉదారత్వం చాటుకున్నారు. మధిర మున్సిపాలిటీ విటల్ రావు నగర్ కు చెందిన గౌరమ్మ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో వీరి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.