AKP: ఖరీఫ్ సీజన్ కోసం మండలానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సోమవారం వ్యవసాయ అధికారి చిరంజీవి తెలిపారు. ఇందులో భాగంగా బీపీటీ-5204 రకం 93.25 క్వింటాళ్లు, ఎంటీయూ-1061 రకం 90 క్వింటాళ్లు, ఆర్జీఎల్-2437 రకం 506.40 క్వింటాళ్ల విత్తనాలు ఉన్నాయన్నారు. మొత్తం 13 రకాలకు చెందిన 719.35 క్వింటాళ్ల విత్తనాల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన చెప్పారు.