విజయనగరం జిల్లా గ్రంథాలయ సేవా సంఘం చేపట్టిన పుస్తక హుండీ ద్వారా సేకరించిన పుస్తకాలను స్థానిక గురజాడ కేంద్ర గ్రంథాలయంలో వున్న విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులంతా పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ సభ్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రవూఫ్, కొత్తలి ఎర్నాయుడు, ఆర్. బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.