KNR: అసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సైదాపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. శాంతిభద్రతల కారణాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో జాగిరిపల్లి సర్పంచ్ తొంట రజనీకాంత్, దుద్దెనపల్లి మాజీ సర్పంచ్ తాటిపల్లి యుగంధర్ రెడ్డి ఉన్నారు.