అన్నమయ్య: జిల్లాలో నేటి నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు జూన్ నెల కోటా కింద ఉచిత బియ్యం, నగదు చెల్లింపుతో చక్కెర పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని DSO తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలోని కార్డుదారులకు కేజీ గోధుమ పిండి కూడా అందజేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని అర్హులైన కార్డుదారులు వినియోగించుకోవాలని కోరారు.