గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్, సపోర్టింగ్ స్టాఫ్‌కు ప్రమాదం తప్పింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం వారు హోటల్‌కు తిరుగుప్రయాణమైన బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా పొగలు వ్యాపించాయి. దీంతో బస్సు మార్గమధ్యంలోనే నిలిచిపోయింది. అయితే, అందరూ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. మరో బస్సు ఏర్పాటు చేసే వరకు వారు రోడ్డుపై వేచి చూసినట్లు సమాచారం.