కోనసీమ: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అమలాపురం వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ తెలిపారు. నిరసన కార్యక్రమం అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ శ్రేణులు హాజరు కావాలని కోరారు.