IPLలో ఒకే సీజన్లో అత్యంత తక్కువ మంది ప్లేయర్లను ఉపయోగించిన జట్టుగా 2015లో చెన్నై (14 మంది) అగ్రస్థానంలో ఉంది. తర్వాత ముంబై (15), KKR, RCB (16 మంది చొప్పున) ఉన్నాయి. ఇక IPL ప్లేఆఫ్స్/నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధికంగా 28 మ్యాచ్లు ఆడి ధోనీ సరికొత్త రికార్డు సృష్టించగా..జడేజా 25, అశ్విన్, సురేష్ రైనా24, రోహిత్, రాయుడు 23, కోహ్లీ 19 తర్వాతి స్థానాల్లో ఉన్నారు.