టీమిండియా ఆల్రౌండర్ శివం దూబే టీ20 ప్రపంచకప్లో అదరగొడుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దూబే మాట్లాడుతూ.. తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. మహేష్ బాబు అత్యంత హ్యాండ్సమ్ హీరో అంటూ కొనియాడాడు. అలాగే, అల్లు అర్జున్ కూడా తనకు ఇష్టమని, ఆయన నటించిన ‘పుష్ప’ సినిమా బాగా నచ్చిందని పేర్కొన్నాడు.