అహ్మదాబాద్ వేదికగా GTతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో RCB టాస్ గెలిచింది. కెప్టెన్ రజత్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. 2022 ఛాంపియన్ గుజరాత్, డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు సమాన బలాబలాలతో ఈ రసవత్తర పోరులో తలపడుతున్నాయి. ఈసారి విజేతగా ఎవరు నిలుస్తారోనన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.