ఈటీవీ విన్ తన సరికొత్త ఓటీటీ కంటెంట్‌ను ‘విన్ జాతర’ పేరుతో ప్రకటించింది. ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేసింది. ఇందులో విరాజ్ అశ్విన్ నటించిన ‘గుర్తుకొస్తున్నాయి’, విభిన్న కథాంశంతో వస్తున్న ‘జిల్లేడు చెట్టు’, ఉత్కంఠభరితమైన ‘ది అన్‌టోల్డ్ టేల్ ఆఫ్ బ్లడ్-వై గోదావరి’ వంటి సినిమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.