పాము విషం ప్రాణాంతకమే అయినా, దాని రంగు జాతిని బట్టి మారుతుంది. సాధారణంగా ఇది జిగురుగా ఉంటూ పసుపు, బంగారు, లేత ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉంటుంది. ఆహారం అరగడానికి, ఆత్మరక్షణకు పాములు విషాన్ని వాడతాయి. విశేషమేమిటంటే, ఈ విషంతోనే గుర్రాల ద్వారా యాంటీ వీనమ్(విరుగుడు) తయారు చేస్తారు. అంతేకాదు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల మందుల్లోనూ దీన్ని వాడి ప్రాణాలు కాపాడుతున్నారు.