PDPL: మంథనిలోని శ్రీ మంత్రకూట సీతారామ గౌతమేశ్వర వేద పాఠశాలలో ప్రవేశానికి విద్యార్థులను ఆహ్వానిస్తున్నట్లు ఆధ్యాపకులు ఒజ్జల గణేష్ అవధాని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేద పాఠశాలలో 2026 సంవత్సరంలో బోధించే కృష్ణ యజుర్వేద క్రమాంతము, కృష్ణ యజుర్వేదస్మార్తము ప్రవేశానికి ఉపనయన సంస్కారం కల్గిన సాంప్రదాయ విద్యార్థులు 7-13 ఏళ్ల లోపు వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.