HYD: నగరంలో ఉచిత నీళ్ల పేరుతో మీటర్ల దందా జోరుగా సాగుతోంది. పనికిరాని డిజిటల్ మీటర్లను సిండికేట్ కంపెనీల నుంచి భారీ రేట్లకు కొనేశారు. దాదాపు 30% మీటర్లు డబ్బాలే అని ఆడిట్లో తేలినా అధికారులు కళ్లు మూసుకున్నారు. రూ. 450 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది.