నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు. 3వ రౌండ్లో వరల్డ్ నం.1 మాగ్నస్ కార్ల్సెన్ను 46 ఎత్తుల్లో ఓడించి షాకిచ్చాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు, వరల్డ్ చాంపియన్ గుకేశ్ 3వ రౌండ్ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు.