AP: రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతుంటే కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షాలు పడ్డాయి. రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. తూ.గో.జిల్లా నిడదవోలులో ఈదురుగాలులలో వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అల్లూరి జిల్లా వ్యాప్తంగా మోస్తరు వానలు పడ్డాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనూ పలు చోట్ల ఈదురుగాలులతో వర్షం పడింది.