SRD: అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలంలో హైదరాబాద్-రాయికోడ్-నారాయణఖేడ్ ప్రధాన రహదారిపై గత కొద్దిరోజుల క్రితం చెట్టు కూలింది. అయినప్పటికీ, వివిధ శాఖల అధికారులు దీనిని పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కర్ణాటక, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.ప్రజలు వెంటనే చెట్టును తొలగించాలని అధికారులను కోరుతున్నారు.