NGKL: కల్వకుర్తి బస్టాండ్ నుండి అచ్చంపేట బయలుదేరిన అచ్చంపేట డిపో ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో హఠాత్తుగా నిలిచిపోయింది. సాయంత్రం 6 గంటల నుంచే బస్సు రోడ్డుపై పూర్తిగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో రాత్రి వేళ మహిళలు, చిన్నారులు, వృద్ధులు రోడ్డుపైనే వేచి ఉంటూ తీవ్ర అవస్థలు పడ్డారు.