ఉమ్మడి వరంగల్ జిల్లా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను జూన్ 4లోగా పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.