SDPT: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 308 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేటాయింపుల్లో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాకు 132 పాఠశాలలు లభించగా, మెదక్ జిల్లాకు 90, సిద్దిపేట జిల్లాకు 86 పాఠశాలలు మంజూరయ్యాయి. 2026-27 నుండి ఈ నూతన విద్యా విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.