SRCL: కాంగ్రెస్ పార్టీనీ మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బోయినపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువిన్ యాదవ్ ఆధ్వర్యంలో విప్ ఆది శ్రీనివాస్‌ను వేములవాడలోని అతని నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విప్‌ను మండల నాయకులు శాలువాతో సత్కరించారు.