కోనసీమ: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చింతా తమ్మిరెడ్డి అధ్యక్షతన కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం అమలాపురంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమం కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు.