AP: రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి నిబద్ధతతో పనిచేస్తున్నామని CM చంద్రబాబు స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల ఉద్యోగాలు కల్పిస్తే ఏడాది తర్వాత YCP ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పు చేస్తే ఎవరికైనా తాట తీస్తానని.. తప్పు చేయకపోతే ఎవరూ ఏమీ చేయలేరన్నారు. DSCపై తప్పుడు ప్రచారాలతో యువతలో అపోహలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.