ASR: ఎటపాక మండలం బూరుగువై గ్రామంలో చండేనా గుండి రాజకుమారి చెందిన తాటాకు ఇల్లు ఈనెల 23న కరెంట్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఇంటిలోని సామగ్రి పూర్తిగా దగ్ధమై కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. బాధిత కుటుంబాన్ని సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు పూనెం వెంకటరావు, సవలం రాము పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.