కృష్ణా: అవనిగడ్డలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నియోజకవర్గ నాయకులు బొబ్బా గోవర్ధన్ నివాళి అర్పించారు. తెలుగుదేశం పార్టీ పతాకం ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. సీనియర్ టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఘన సన్మానం చేశారు. రెండవ రోజు హైబ్రీడ్ మహానాడు కార్యక్రమం లైవ్ తిలకించారు.