NGKL: అచ్చంపేటలోని శివసాయినగర్ కాలనీలోని ప్రభుత్వ, మున్సిపల్ స్థలాల ఆక్రమణలపై కాలనీ ప్రజలు గురువారం ఎమ్మెల్యే వంశీకృష్ణను కలిసి ఫిర్యాదు చేశారు. లే అవుట్లో మున్సిపాలిటీకి కేటాయించిన స్థలంతో పాటు వాటర్ ట్యాంక్, రోడ్లు, డ్రైనేజీ ప్రాంతాలను ఆక్రమిస్తున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.