ATP: స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది నిర్వహించే ఎన్టీఆర్ ట్రోఫీ కేసీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌ను కాలవ భరత్ ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభించారు. కాలవ ఫాండేషన్ ఛైర్మన్ కాలవ భరత్ గురువారం రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కేసీఎల్-3 సీజన్‌ను ప్రారంభించారు. రాయదుర్గం పట్టణంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.