MDK: హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో వీవోఏలు ఒంటి కాలిపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఐకేపీ వీవోఏల జేఏసీ పిలుపు మేరకు w సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. తమకు కనీస వేతనం రూ.20 వేలు చెల్లించాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తిస్తూ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, అర్హులైన వీవోఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.