NDL: వన్ మంత్ – ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జీ. రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ వివరించారు.