ADB: నార్నూర్ మండలంలోని బాలన్పూర్ గ్రామపంచాయతీలో ఇంద్రవెల్లి CFL ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు ఆర్థిక అక్షరాస్యత, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకింగ్ సేవలు, పొదుపు అలవాట్లు, డిజిటల్ లావాదేవీలలో జాగ్రత్తలు వివరించారు. ఓటీపీలు, అనుమానాస్పద లింకులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.