NZB: డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బీ) గ్రామంలో గురువారం ఎన్టీఆర్ జయంతి వేడుకను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. పేదల పాలిట పెన్నిధి ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు బ్రహ్మనందం, సుబ్బారావు, చౌదరి, కేశవరావు,వేంకటేశ్వరావు, మురారీ, రామకృష్ణ, సర్పంచి వాసుబాబు పాల్గొన్నారు.