NZB: పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న బీజేపీ జిల్లా స్థాయి పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణా తరగతుల్లో గురువారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. శిక్షణా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ను ఆయన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారితో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు.