TPT: ఆకలితో అలమటిస్తున్న పేదలకు కిలో రూ.2 కే బియ్యం అందించి వారి ఆకలి తీర్చిన మహాత్ముడు NTR అని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నారాయణవనం మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు.