VKB: బక్రీద్ పండుగ సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ముస్లిం సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనలు సజావుగా సాగేందుకు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పండుగ రోజున ఈద్గాలు, మసీదుల వద్ద తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు.