SDPT: నంగునూర్ మండలంలో కురిసిన వర్షాలకు తోడు వీచిన భీకర ఈదురు గాలులతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రహదారులపై చెట్లు, కొమ్మలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పంచాయతీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చెట్లను తొలగించారు. వ్యవసాయ బావుల వద్ద కూలిన వృక్షాలను రైతులు స్వయంగా తొలగిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.