CTR: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సునీల్ కుమార్ విమర్శించారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు సీఎం చంద్రబాబునాయుడు పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.