ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు చెక్ పోస్ట్ వద్ద 16 నంబర్ జాతీయ రహదారిపై గోవుల అక్రమ రవాణా పోలీసులు అడ్డుకున్నారు. గురువారం తెల్లవారుజామున బొలెరో వాహనంలో తరలిస్తున్న రెండు ఆవు దూడల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.