WNP: ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు ఎస్సై జయన్న సూచించారు. ఖానాపూర్ వార్డు స్టేజీ వద్ద ప్రయాణికులకు సైబర్ నేరాలు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు. చరవాణిలో వచ్చే సందేశాలకు, ఇతర యాప్‌లకు స్పందించొద్దని సూచించారు. ఆధార్ కార్డు నంబర్లు గుర్తు తెలియని వ్యక్తులకు చెప్పొద్దన్నారు. హెడ్ కానిస్టేబుల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.