నెల్లూరు: దుత్తలూరు మండలం నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. అత్యవసర చికిత్స కోసం వచ్చిన రోగికి సకాలంలో వైద్యం అందక మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, సిబ్బందిని వేడుకున్నా వారు స్పందించలేదని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.