కోనసీమ: అమలాపురం పరిధిలోని ప్రధాన పంట కాలువల శుభ్రతపై అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. కాలువల్లోని చెత్త, కలుషిత నీరు దిగువ గ్రామాల ప్రజల ఆరోగ్యానికి హానికరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్, మున్సిపాలిటీలు కలిసి చల్లపల్లి నుంచి నడిపూడి వరకు పూడికతీత పనులు చేపట్టాలన్నారు. తీసిన మట్టి గుట్టలు మళ్లీ కాలువలోకి జారిపడుతున్నాయని ఆరోపించారు.