GNTR: టీడీపీ మహానాడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మంగళగిరిలో తీవ్ర విమర్శలు చేశారు. అది మహానాడు కాదు, ప్రజలను దగా చేసిన నాడంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిన మాటలకు, ఈ రెండేళ్ల పాలనలో చేస్తున్న పనులకు అస్సలు పొంతన లేదన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొని, ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌ల భజన కోసమే ఈ వేదికను వాడుకుంటున్నారన్నారు.