SRPT: కోదాడ మండల పరిధిలోని దొరకుంట గ్రామానికి చెందిన వీర్ల విజయలక్ష్మి(32) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. పొలం వద్ద పనిచేస్తూ, బావి వద్ద కాళ్లు, చేతులు కడుక్కుంటున్న సమయంలో కాలుజారి నీటిలో పడిపోయి, ఈత రాక మునిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై గోపాల్ రెడ్డి కేసు నమోదు చేశారు.