ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే గాంధీ పార్క్ డెవలప్మెంట్ పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, త్వరగా పూర్తి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసి మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.