NRPT: దామరగిద్ద మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీల కొత్త పాలకవర్గాల ఏర్పాటుతో సర్పంచుల ఆదేశాల మేరకు మురుగు కాలువల క్లీనింగ్, రోడ్ల శుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పంచాయతీ కార్మికులు వేగంగా పనిచేసి పలు కాలనీలలో మిషన్ భగీరథ పైపుల లీకేజీలకు మరమ్మతులు కూడా చేపట్టారు.