VZM: ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GO 30ను రద్దు చేయాలని బుధవారం భోగాపురం MRO తహసీల్దార్ హరికి రైతులు వినతిపత్రం అందజేసారు. అభివృద్ధి పేరిట ఐటీ, డేటా సెంటర్లకు భూములు ఇస్తే తామంతా రోడ్డున పడతామని వారు వాపోయారు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న తమకు అన్యాయం చేయవద్దని మొరపెట్టుకున్నారు. ఈ మేరకు తమ గోడును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు.