VZM: ‘జలధార-జలహారతి’ పథకం కింద గుర్తించిన చెరువుల అభివృద్ధి పనులు జూలై 15లోగా పూర్తి చేస్తామని గంట్యాడ MPDO రమణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మండలం పరిధిలో ఈ పథకం కింద 315 చెరువులను గుర్తించామని, వీటిలో 220 చెరువుల పనులు ఇప్పటికే గ్రౌండ్ చేయడం జరిగిందన్నారు. 40 చెరువుల పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిని జూలై 15లోగా పూర్తి చేస్తామన్నారు.