AP: గోదావరితో పాటు ఇతర నదుల్లో కాలుష్య నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్గా, 6 జిల్లాల కలెక్టర్లు, పలు శాఖల అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. పుష్కరాల లోపు పొల్యూషన్ ఆడిట్ నిర్వహించి, ప్రతి 2 వారాలకోసారి ఈ కమిటీ సమీక్ష జరపనుంది.